అక్షరటుడే, ఇందూరు: Masa Shiva Rathri | మాస శివరాత్రి పర్వదినాన జిల్లా కేంద్రంలోని(Nizamabad) ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Masa Shiva Rathri | మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం ఒకేరోజు..
ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైనది. అలాగే మాస శివరాత్రి కూడా ఈ నక్షత్రం సందర్భంగా సోమవారం వచ్చిన సందర్భంగా ఉపవాసాలు జాగరణ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని వేద పండితులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు (Rudrabhishekam) నిర్వహించారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, శుంభుని గుడి ఇతర శివాలయాల్లో ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయాల ప్రతినిధులు భక్తులకు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: లోకల్ ట్రైన్లో ఆగిపోయిన ఏసీ.. పలువురికి అస్వస్థత..