DRO Geetha Felicitation | జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకెళ్దాం..: డీఆర్​వో గీత

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: DRO Geetha Felicitation | జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకెళ్దామని డీఆర్​వో గీత (nizamabad dro geetha) అన్నారు. ఇటీవల ఆమె జిల్లా రెవెన్యూ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుక్రవారం టీఆర్​ఈఎస్​ఏ (TRESA) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు కలెక్టరేట్​లోని (Nizamabad Collectorate) డీఆర్​వో ఛాంబర్​లో శుక్రవారం ఆమెను మర్యాదపూర్వకంగా అసోసియేషన్​ ప్రతినధులు, ఉద్యోగులు కలిశారు.

DRO Geetha Felicitation | ఎల్లప్పుడూ అండగా ఉంటా..

తనను సన్మానించిన టీఆర్​ఈఎస్​ఏ జిల్లా అధ్యక్షుడు రమణ్​రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్​ కుమార్​, అసోసియేషన్​ ప్రతినిధులకు డీఆర్​వో కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు వెళ్దామని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చిన తాను ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డీఆర్​వోను కలిసిన వారిలో అసోసియేషన్​ వైస్​ ప్రసిడెంట్​ భూపతి ప్రభు, వినయ్ సాగర్, శైలజ, బోధన్ డివిజన్ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శులు కార్తీక్ రెడ్డి నజీర్ ఉద్దీన్, తహశీల్దార్లు శ్రీధర్, వెంకటరమణ, శాంత, కిరణ్మయి, నరేష్, కోశాధికారి సంపత్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ విజయరామరాజు, నాయబ్​ తహశీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు.

dro

ఇది కూడా చదవండి : BJP Ticket Scam | ఇందూరు బీజేపీలో కలకలం.. కార్పొరేటర్​ టికెట్​ పేరిట డబ్బులు వసూలు..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *