Nizamabad DRO Geetha | జిల్లా రెవెన్యూ అధికారిణికి ఘనసన్మానం

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad DRO Geetha | జిల్లా రెవెన్యూ అధికారిణిగా గీత (DRO Geetha) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను పలు రెవెన్యూ అసోసియేషన్ల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

Nizamabad DRO Geetha | టీజీటీఏ, టీజీఆర్​ఎస్​ఏ సంఘాల ఆధ్వర్యంలో..

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఆర్​వో గీతను ఆమె కార్యాలయంలో గురువారం టీజీటీఏ(TGTA), టీజీఆర్​ఎస్​ఏ(TGRSA) ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. నాయకులు శేఖర్, దేవి సింగ్, పృథ్వీ, కిషన్, అరుణ, ప్రశాంత్, నితిన్, అశోక్, అమృత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అధికారిణి గీత హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస విద్యాసంస్థల సొసైటీ (TGSWREI)లో అడిషనల్​ సెక్రెటరీగా పనిచేశారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన అదనపు కలెక్టర్లు, స్పెషల్​ గ్రేడ్​ కలెక్టర్ల బదిలీల్లో భాగంగా నిజామాబాద్​కు వచ్చారు. ఆమె తహశీల్దార్​ స్థాయి నుంచి డీఆర్వో స్థాయికి పదోన్నతులు పొందారు.

Nizamabad DRO Geetha |

ఇది కూడా చదవండి: Bandi Bhagirath POCSO Case | భగీరథ్ పోక్సో కేసులో ట్విస్ట్​.. బాధితురాలి వయసుపై కోర్టులో సంచలన వాదనలు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *