నిజామాబాద్Nizamabad DRO Geetha | నిజామాబాద్​ డీఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన గీత

Nizamabad DRO Geetha | నిజామాబాద్​ డీఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన గీత

నిజామాబాద్​ డీఆర్వోగా బి.గీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు సిబ్బంది స్వాగతం పలికారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad DRO Geetha | నిజామాబాద్​ డీఆర్వోగా బి.గీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు సిబ్బంది స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం డీఆర్వో గీత (DRO Geetha) మాట్లాడుతూ.. జిల్లాలో రెవెన్యూ పరిపాలనకు సంబంధించి ఉన్నతాధికారి, ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఏవైనా ఇబ్బందులు తనను సంప్రదించవచ్చని చెప్పారు.

Nizamabad DRO Geetha | కలెక్టర్​ను కలిసిన డీఆర్వో

Nizamabad DRO Geetha

నిజామాబాద్​ డీఆర్వోగా గీత బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), అదనపు కలెక్టర్​లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పూలమొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలో పరిస్థితులపై డీఆర్వోకు పలు సూచనలు చేశారు.

Nizamabad DRO Geetha | హైదరాబాద్​ నుంచి బదిలీపై..

Nizamabad DRO Geetha

గీత హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస విద్యాసంస్థల సొసైటీ (TGSWREI)లో అడిషనల్​ సెక్రెటరీగా పనిచేశారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన అదనపు కలెక్టర్లు, స్పెషల్​ గ్రేడ్​ కలెక్టర్ల బదిలీల్లో భాగంగా నిజామాబాద్​కు వచ్చారు. ఆమె తహశీల్దార్​ స్థాయి నుంచి డీఆర్వో స్థాయికి పదోన్నతులు పొందారు.

ఇది కూడా చదవండి..: Heat Stroke Awareness | వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి: డీఎంహెచ్​వో రాజశ్రీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Gold ETF Surge | సుంకాల ప్రభావం.. భారీగా పెరిగిన ఈటీఎఫ్ లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Gold ETF Surge | ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల...

Kharif MSP Hike | రైతులకు గుడ్​న్యూస్​.. పంటలకు పెరిగిన మద్దతు ధర

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kharif MSP Hike | కేంద్ర ప్రభుత్వం...

Gold Import Duty | పెరిగిన దిగుమతి సుంకాలు.. ఒత్తిడిలో నగల కంపెనీల షేర్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Import Duty | పశ్చిమాసియాలో జియో...

Stock Market Closing | హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Closing | దేశీయ స్టాక్ మార్కెట్...