అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Education Hub Works | వికారాబాద్ (Vikarabad) జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఇప్పటినుంచి ప్రతి నెలా పనుల పురోగతిని తనిఖీ చేస్తానని చెప్పారు.
ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించి ఆయా విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను సీఎం మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఇంజనీరింగ్ (Engineering College), మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కాలేజీలు, ఫిజియో థెరఫీ – పారా మెడికల్ కాలేజీలు, సంబంధిత హాస్టళ్ల నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
Education Hub Works | అధికారులపై ఆగ్రహం
నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిని సస్పెండ్ చేయడానికి వెనుకాడొద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరగడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించి ఆయా విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయి తిరిగి పరిశీలించారు.
ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న… pic.twitter.com/wUPwoJKjpe
— Telangana CMO (@TelanganaCMO) July 21, 2026
దీనిని కూడా చదవండి : Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. ఎలా అప్లై చేయాలంటే?