అక్షరటుడే, వెబ్‌డెస్క్ : California Road Accident | అమెరికా (America)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటనలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
కాలిఫోర్నియాలోని సాల్టన్ సిటీలో సోమవారం (యూఎస్ కాలమానం ప్రకారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని బంధువులు తెలిపారు. మృతుల్లో 45 ఏళ్ల నజియా సల్మా, ఆమె కుమార్తె హఫీజా నేహా షేక్ (19), కుమారుడు హఫీజ్ ఒమర్(14) ఉన్నారు.
California Road Accident | ఇద్దరికి గాయాలు
హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌లో దాదాపు దశాబ్దం పాటు శాస్త్రవేత్తగా పనిచేసిన నజియా భర్త షేక్ అబ్దుల్ నవీద్, వారి ఏడేళ్ల కుమార్తె ఖతీజా షేక్ ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణవార్త తెలియగానే వారు నివాసం ఉంటున్న సైదాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి అంత్యక్రియలు జూలై 24న అక్కడే నిర్వహించే అవకాశం ఉందని బంధువులు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. హైదరాబాద్ బాధిత కుటుంబ సభ్యులను ఎంఐఎం ఎమ్మెల్యే హుస్సేన్ పరామర్శించారు.
దీనిని కూడా చదవండి : SI Suspended | ఎస్సై సస్పెండ్.. సంబరాలు చేసుకున్న ప్రజలు