అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Firecrackers Seized | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మంగళ్‌హాట్‌లో పోలీసులు దాడి చేసి భారీగా టపాసులను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా నిల్వ చేయడంతో వాటిని సీజ్ చేశారు.
దీపావళి పండుగ సమీపిస్తుండటంతో టపాసుల వ్యాపారం జోరందుకుంది. వ్యాపారులు క్రాకర్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే పలువురు నిబంధనలు పాటించకుండా క్రాకర్స్ నిల్వ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పోలీసులు చర్యలు చేపట్టారు. బాణసంచా దుకాణాలపై దాడులు చేపడుతున్నారు.
Firecrackers Seized | వ్యాపారి అరెస్ట్
జాలీ హనుమాన్ దేవాలయానికి ఎదురుగా ఉన్న రహీంపురాలోని జనసాంద్రత అధికంగా ఉన్న నివాస ప్రాంతంలో, సరైన లైసెన్సులు లేకుండా బాణసంచాను అక్రమంగా నిల్వ ఉంచాడనే ఆరోపణలపై మంగళ్‌హాట్ పోలీసులు వ్యాపారవేత్త ఎం. కిషోర్ లాల్‌ను అరెస్టు చేశారు. బ్రాండెడ్ బాణసంచా పెట్టెలు, మల్టీ-షాట్లు, సౌండ్ బాంబులు, స్పార్క్లర్లు, గ్రౌండ్ స్పిన్నర్లు, రాకెట్లు, దీపావళి గిఫ్ట్ ప్యాక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అనధికారిక నిల్వ నివాసితులకు తీవ్రమైన భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని పోలీసులు తెలిపారు. నివాస ప్రాంతాల్లో టపాసులు నిల్వ చేయొద్దని పేర్కొన్నారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : Abhijit Deepke Arrest | సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అరెస్ట్