Khairatabad Ganesh Shobhayatra | ఖైరతాబాద్‌ బడా గణేషుడి శోభాయాత్ర షురూ..

భాగ్యనగరంలో వైభవంగా జరిగే వినాయక నిమజ్జన మహోత్సవం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Khairatabad Ganesh Shobhayatra | భాగ్యనగరంలో వైభవంగా జరిగే వినాయక నిమజ్జన మహోత్సవం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైరతాబాద్‌ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి శోభాయాత్ర అట్టహాసంగా మొదలైంది. భక్తుల జయధ్వానాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల నడుమ స్వామివారి శోభాయాత్ర హుస్సేన్‌సాగర్ వైపు సాగుతోంది. క్రేన్‌లో తలెత్తిన కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా యాత్ర ప్రారంభం కావడానికి సుమారు 3 గంటల సమయం ఆలస్యమైంది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కొబ్బరికాయ కొట్టి ఈ శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభించారు.

Khairatabad Ganesh Shobhayatra | భారీగా తరలివచ్చిన భక్తులు..

ప్రముఖ బడా గణేషుడిని కడసారి కళ్లారా వీక్షించేందుకు, శోభాయాత్రలో ప్రత్యక్షంగా పాలుపంచుకునేందుకు వందలాది మంది భక్తులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి జాప్యం జరగకుండా మధ్యాహ్నం ఒంటిగంట కల్లా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన ప్రక్రియ పూర్తిగా ముగిసేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Khairatabad Ganesh Shobhayatra | పోలీసుల హెచ్చరికలు..

మరోవైపు నిమజ్జన వేడుకల పేరుతో ఎవరైనా అల్లకల్లోలం సృష్టిస్తే మాత్రం పోలీసులు ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శోభాయాత్రలో అశ్లీల డ్యాన్సులు వేసినా, నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించినా నేరుగా జైలుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా నిమజ్జన మార్గాలన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని, రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

ఇది కూడా కూడా చదవండి:  Sep 25 Gold Prices | బంగారం, వెండి ధరల్లో స్వల్ప ఊరట..ప్రధాన నగరాల్లో నేటి రేట్స్​ ఇవే!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *