Osmania University Funds | ఓయూకి ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయి? ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం

ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన రూ.వెయ్యి కోట్ల నిధుల హామీ ఏమైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని నిలదీశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Osmania University Funds | ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన రూ.వెయ్యి కోట్ల నిధుల హామీ ఏమైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓయూ లా కాలేజీలో గురువారం రాత్రి నిర్వహించిన గణేష్‌ ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఓయూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.

Osmania University Funds | మెస్‌ సౌకర్యం లేక..

లా కాలేజీ విద్యార్థులకు కనీస వసతులు కూడా కరవయ్యాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గత పది నెలలుగా మెస్‌ సౌకర్యం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బట్లు వర్ణనాతీతమన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, హాస్టల్ గదుల్లోకి పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే యూనివర్సిటీ డిస్పెన్సరీ కేవలం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకే పనిచేస్తుండటంతో, అత్యవసర సమయాల్లో విద్యార్థులు తీవ్ర అనారోగ్య సమస్యలపాలవుతున్నారని పేర్కొన్నారు.

Osmania University Funds | ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ..

గత ఐదారు నెలలుగా విద్యార్థులు రోడ్డుపై వంటలు చేసుకుంటూ నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని కవిత విమర్శించారు. మంత్రి సీతక్క కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినేనని గుర్తుచేస్తూ, ఆమె వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. లా కాలేజీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, అవసరమైతే విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేస్తూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:  Khairatabad Ganesh Shobhayatra | ఖైరతాబాద్‌ బడా గణేషుడి శోభాయాత్ర షురూ..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *