Varanasi Road Accident |ఫ్లైఓవర్‌పై సెల్ఫీ సరదా.. దూసుకొచ్చిన లారీ.. నలుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-వారణాసి జాతీయ రహదారి (NH-19)పై సోమవారం తెల్లవారుజామున భయానక ప్రమాదం జరిగింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Varanasi Road Accident | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-వారణాసి జాతీయ రహదారి (NH-19)పై సోమవారం తెల్లవారుజామున భయానక ప్రమాదం జరిగింది. వారణాసికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్జామురాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపాపూర్ ఫ్లైఓవర్‌పై రోడ్డు పక్కన నిలిపివున్న స్కార్పియో కారును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Varanasi Road Accident | దర్శనం ముగించుకుని వస్తుండగా..

బాధితులంతా వింధ్యాచల్ ధామ్ ఆలయంలో అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో కాశీకి వస్తుండగా ఈ ప్రమాదం ఎదురైంది. రూపాపూర్ ఫ్లైఓవర్‌పై వాహనాన్ని నిలిపి, రెయిలింగ్ సమీపంలో సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జవడమే కాకుండా, బైట నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు వంతెన పైనుంచి సుమారు 30 అడుగుల కిందకు పడిపోయారు.

Varanasi Road Accident | సీఎం దిగ్భ్రాంతి..

మృతులను అమన్ యాదవ్, గోలు, అలోక్ మిశ్రాలుగా గుర్తించారు. గాయపడిన కన్హయ్య యాదవ్, నిఖిల్ కుమార్‌లతో పాటు మరొకరిని పోలీసులు వారణాసి ట్రామా సెంటర్‌కు తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని 200 మీటర్ల దూరంలో వదిలేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Hyderabad Fire Accident | హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *