అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Fire Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చార్మినార్ సమీపంలో మదీనా రోడ్డులో ఉన్న బాంబే హోసియరీలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి.
హైకోర్టు దగ్గర మదీనా రోడ్డులో ఉన్న బట్టల దుకాణంలో మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నాలుగు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అధికారులు ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.అగ్నిప్రమాదానికి గల కారణం, మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Hyderabad Fire Accident | మాదాపూర్‌లో..
మాదాపూర్‌లోని యూనిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్‌లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కంపెనీ డ్రోన్ నిరోధక పరీక్షా పరికరాలను తయారు చేస్తుంది. వెంటనే మూడు అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా హైదరాబాద్ నగరంలో ఇటీవల అగ్ని ప్రమాదాలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దుకాణాలు, మాల్స్‌లో తనిఖీలు చేపట్టాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad SI Transfers | హైదరాబాద్‌లో భారీగా ఎస్సైల బదిలీ