అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad SI Transfers | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఎస్సైలను బదిలీ చేస్తూ నగర కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 75 మందికి స్థానచలనం కలిగించారు.
Hyderabad SI Transfers | 75 మంది ట్రాన్స్ఫర్
నగరంలో ఇటీవల 16 మంది సీఐలను ట్రాన్స్ఫర్ చేసిన సీపీ.. తాజాగా 75 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లు, స్పెషల్ విభాగాల్లో పనిచేస్తున్న 75 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను ఉత్తర్వులు జారీ చేశారు. నగరం అంతటా పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, శాంతిభద్రతల నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా బదిలీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా భారీ సంఖ్యలో బదిలీలు చేపట్టడంతో పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండి..: Private STP Registration | ప్రైవేట్ ఎస్టీపీల నమోదుకు అక్టోబర్ 25 వరకు గడువు