అక్షరటుడే, వెబ్‌డెస్క్: FII Investment Outflows | దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈనెలలో ఇప్పటికే నికరంగా రూ. 48 వేల కోట్లకుపైగా స్టాక్స్ విక్రయించారు. సెప్టెంబర్‌లో రూ. 44,012 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. గతనెలలో విక్రయించిన మొత్తాన్ని ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటికే దాటడం గమనార్హం.
FII Investment Outflows | ఆరేళ్లుగా అమ్మకాల పరంపర..
విదేశీ సంస్థాగత మదుపరులు భారత్‌నుంచి ఆరేళ్లుగా పెట్టుబడులు వెనక్కి తీసుకువెళ్తూనే ఉన్నారు. చివరిసారిగా కోవిడ్ ఇయర్ 2020లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఆ సంవత్సరం దేశీయ స్టాక్ మార్కెట్‌లో నికరంగా రూ. 64,379 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2021 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 2021లో నికరంగా రూ. 92,729 కోట్ల స్టాక్స్ విక్రయించిన ఎఫ్ఐఐలు 2022లో మూ డింతలు పెంచి రూ. 2,78,429 కోట్లు అమ్మారు. 2023లో రూ. 16,510 కోట్లు, 2024లో రూ. 3,02,434 కోట్లు, 2025లో రూ. 3,06,419 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు.
FII Investment Outflows | ఈ ఏడాది రికార్డు స్థాయిలో..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) నుంచి 2021నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తూ వస్తున్న ఎఫ్ఐఐలు.. ఈ ఏడాది మరింత జోరు పెంచారు. తొమ్మిదిన్నర నెలల్లోనే రికార్డు స్థాయిలో నికరంగా రూ. 4,51,836 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనార్హం. మొత్తంగా ఆరేళ్ల కాలంలో నికరంగా రూ. 14.5 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
FII Investment Outflows | ఎందుకు ఇంతలా అమ్మకాలు?
కోవిడ్ తర్వాత విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత్‌నుంచి పెట్టుబడులు ఉపసంహరించడం ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక వేగం పెరిగింది. ట్రంప్ ప్రపంచ దేశాలపై ఇష్టారాజ్యంగా సుంకాలు విధిస్తూ రావడంతో అస్థిరత నెలకొంది. జియో పొలిటికల్ టెన్షన్స్‌తో క్రూడ్ ఆయిల్ ధర గణనీయంగా పెరగడంతో ప్రపంచంలో మూ డో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇతర దేశాలలో ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ ఆధారిత షేర్ల ర్యాలీ కారణంగా విదేశీ నిధులు ఆ మార్కెట్ల వైపు మళ్లాయి. డాలర్ బలపడుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం ప్రభావం చూపుతున్నాయి. ఇన్ఫ్లెషన్ పెరుగుతుండడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. ఈ ఏడాది మరోసారి వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలున్నాయి. ఇప్పటికే అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎన్నో ఏళ్ల గరిష్ఠాలకు చేరుకున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే అమెరికా ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం విదేశీ ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. దీంతో భారత మార్కెట్ల నుంచి నిధుల ప్రవాహం కొనసాగే అవకాశాలున్నాయి.
FII Investment Outflows | స్వల్పంగా కొనుగోళ్లు..
కొన్నాళ్లుగా అలుపన్నదే లేకుండా అమ్మకాలకు పాల్పడుతున్న ఎఫ్ఐఐలు.. అక్టోబర్ 16న నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో రూ. 1,165 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్స్ 5.3 శాతంనుంచి 5.09 శాతానికి తగ్గడం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలతో మూడునాలుగు సెషన్లుగా డాలరుతో పోలిస్తే రూపాయి బలపడుతుండడం దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ కొనుగోళ్లు కొనసాగుతాయో లేదో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి..: Vivo S2 FE 5G : వీవోనుంచి మిడ్ రేంజ్‌లో అద్భుతమైన ఫోన్.. రేపటినుంచి అందుబాటులోకి..