June 09 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 09 Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో భౌగోళిక రాజకీయ పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి మేరకు పరస్పరం దాడులను నిలిపివేసినట్లు ఇరాన్, ఇజ్రాయెల్ ప్రకటించాయి. అయితే లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తే తిరిగి ఘర్షణలు ప్రారంభిస్తామని టెహ్రాన్(Tehran) హెచ్చరించింది.

ఇజ్రాయెల్‌తో ఘర్షణ జరిగినప్పటికీ తాము చర్చలను విడిచిపెట్టలేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రకటించడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్‌లో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

June 09 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

సెమీకండక్టర్ స్టాక్స్‌లో లాభాల కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్ పాజిటివ్‌గా ముగిసింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 0.86 శాతం, ఎస్ అండ్ పీ 0.30 శాతం లాభపడగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.01 శాతం నష్టంతో ఉంది.

June 09 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.23 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.58 శాతం నష్టపోగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.05 శాతం పెరిగింది.

June 09 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 3.14 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.98 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.76 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.76 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.23 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.28 శాతం నష్టంతో కదలాడుతోంది. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.22 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

IAS Gandham Chandrudu Story | రూ.ఐదు ‘లంచం’.. ఎండిన డొక్క.. ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడి ‘సర్టిఫికెట్ కథ’!

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 9వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,555 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు 15వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,165 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.83 నుంచి 0.78 కు తగ్గింది.
  • విక్స్ 7.85 శాతం పెరిగి 17.03 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 93.66 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 79 పైసలు బలహీనపడి 95.71 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.91 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.57 వద్ద ఉన్నాయి.
  • అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల కోసం కొత్త హెచ్-1బీ వీసాలపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజును సోమవారం ఫెడరల్ న్యాయమూర్తి కొట్టివేశారు. ఇది కాంగ్రెస్ ఎన్నడూ ఆమోదించని చట్టవిరుద్ధమైన పన్ను అని ఆయన నిర్ధారించారు.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *