Agmont Enterprises IPO | ఐపీవోకు గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ.. జీఎంపీ 39 శాతానికిపైనే..

గోల్డ్ ట్రేడింగ్ చేసే అగ్‌మోంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ ఐపీవోకు వచ్చింది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ 39 శాతం ఉంది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Agmont Enterprises IPO | అగ్‌మోంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీని 2012లో ఏర్పాటు చేశారు. ఇది ప్రొక్యూర్మెంట్, రిఫైనింగ్, బులియన్ ట్రేడింగ్, డిజిటల్ గోల్డ్, జ్యూవెలరీ మ్యాన్‌ఫ్యాక్చరింగ్, ఇంటర్నేషనల్ సేల్స్, గోల్డ్ బేస్డ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కోసం టెక్నాలజీ సపోర్ట్ వంటి వివిధ రకాల సర్వీసులను అందిస్తుంది.

అగ్‌మోంట్ ఎంటర్‌ప్రైజెస్ వ్యాపారం ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది. రిఫైనింగ్, బులియన్ ట్రేడింగ్, డిజిటల్ గోల్డ్ సేవలు, జ్యువెలరీ తయారీ వంటి విలువ గొలుసులోని వివిధ దశలలో కంపెనీ పాలుపంచుకుంటుంది. ఎస్పీవోటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎంటర్‌ప్రైజ్ సేల్స్, ‘గోల్డ్ ఫర్ ఆల్ ’ ప్లాట్‌ఫామ్ ద్వారా రిటైల్ కన్జూమర్లకు సేవలు అందిస్తోంది.

Agmont Enterprises IPO | రూ. 825 కోట్లు సమీకరించేందుకు..

మార్కెట్ నుంచి రూ. 825 కోట్లు సమీకరించేందుకోసం ఆగ్మాంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో (IPO)కు వచ్చింది. రూ. 5 ఫేస్ వ్యాల్యూ కలిగిన 78,68,020 తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 620 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 5 ఫేస్ వ్యాల్యూ కలిగిన 26,01,521 షేర్లను అమ్మడం ద్వారా రూ. 205 కోట్లు సమీకరించనున్నారు. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయంలోంచి వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, ఇన్వెంటరీని నిర్వహించడానికి, కార్యకలాపాలను విస్తరించడానికి ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Agmont Enterprises IPO | ధరల శ్రేణి..

కంపెనీ ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.750 నుంచిి రూ. 788గా నిర్ణయించింది. లాట్‌లో 19 ఈక్విటీ షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,972 తో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్లకు అప్లై చేసుకోవచ్చు.

కోటా : క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ ఐఐలకు 15 శాతం వాటాను కేటాయించారు.

జీఎంపీ : కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో షేరుకు ప్రీమియం రూ. 310 లుగా ఉంది. ఒకవేళ ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ రోజున సుమారు 39 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు : ఆగస్టు 21న ప్రారంభమైన సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ 25 వరకు కొనసాగనుంది. ఆగస్టు 27న షేర్ల కేటాయింపు ఖరారు అవుతుంది. కంపెనీ షేర్లు ఆగస్టు 31న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.

ఇది కూడా చదవండి..: Aug 22 Gold Prices | బంగారం ధరలకు మళ్లీ జోష్..మూడు రోజుల్లో 2.3 శాతం పెరుగుదల..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *