అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: GGH Prisoner Suicide Attempt | పోలీసుల కట్టుదిట్టమైన భద్రతలో ఓ నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని (Nizamabad) జిల్లా జనరల్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
GGH Prisoner Suicide Attempt | జిల్లా జైలు నుంచి..
వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరు పోలీస్ స్టేషన్లో లకావత్ రాజు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా అతడిని ఇటీవల సారంగపూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే శనివారం సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి అతడిని తీసుకొచ్చారు. అయితే జైలు పోలీసుల ఎస్కార్ట్ మధ్య ఉన్న లకావత్ రాజు వారిని తప్పించుకుని జీజీహెచ్ మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడు. దీంతో అతడి తలకు, ఛాతిలో బలమైన గాయాలయ్యాయి. హఠాత్తుగా జరిగిన ఈ ఘటన నుంచి తేరుకున్న పోలీసులు వెంటనే రాజును జీజీహెచ్‌లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జీజీహెచ్‌లో కలకలం రేపింది.
ఇది కూడా చదవండి..: Bodhan Police Station | పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి హల్చల్.. సీఐ, కానిస్టేబుల్‌కు గాయాలు..