Bodhan Police Station | పోలీస్​స్టేషన్​లో వ్యక్తి హల్​చల్​.. సీఐ, కానిస్టేబుల్​కు గాయాలు..

గంజాయి మత్తులో వ్యక్తి పోలీస్​స్టేషన్​లో హల్​చల్​ చేశాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Bodhan Police Station | గంజాయి మత్తులో వ్యక్తి పోలీస్​స్టేషన్​లో హల్​చల్​ చేశాడు. పోలీసులపై దాడికి సైతం తెగబడ్డాడు. ఈ ఘటన బోధన్​ పోలీస్​స్టేషన్​లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Bodhan Police Station | ఓ మహిళ చికిత్స విషయమై..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్​ మండలం (Bodhan Mandal) కొప్పర్గా గ్రామానికి చెందిన ఓ మహిళ చికిత్స నిమిత్తం బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రికి కొన్నిరోజుల క్రితం వచ్చింది.   అక్కడ చికిత్స అనంతరం ఆమె కొప్పర్గకు వెళ్లిపోయింది. అయితే శుక్రవారం రాత్రి ఆ గ్రామానికి  చెందిన సాయిలు అనే వ్యక్తి  ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి హల్​చల్​ చేశాడు. సదరు మహిళకు ఇచ్చిన ట్రీట్​మెంట్​ ఏమిటని ప్రశ్నిస్తూ డ్యూటీ డాక్టర్​తో వాగ్వాదానికి దిగాడు. దీంతో భయభ్రాంతులకు గురైన వైద్యురాలు, సిబ్బంది కలిసి డయల్​ 100కు ఫోన్​ చేశారు. పోలీసులు స్పందించి ఆస్పత్రికి చేరుకుని ఆ వ్యక్తిని పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Bodhan Police Station | పోలీస్​స్టేషన్​లో హంగామా..

అయితే గంజాయి మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఆగ్రహంతో సీఐ, కానిస్టేబుల్​పై దాడికి తెగబడ్డారు. సీఐ తొడపై దాడి చేశాడు. . అలాగే కానిస్టేబుల్​ వేలు కొరకడంతో కొద్దిభాగం తెగిపోయింది. దీంతో హతాశులైన పోలీసులు వెంటనే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. ​పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Kaleshwaram Project | కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు నీళ్లల్లో పోశారు.. మంత్రి పొంగులేటి..

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *