అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BJP Protest | రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ (BJP Nizamabad) జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో (Collectorate) సమీక్షలో పాల్గొన్న మంత్రిని ఘెరావ్ చేశారు.
BJP Protest | హాల్లోని దూసుకెళ్లేందుకు యత్నం..
ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. 22ఏ భూముల వ్యవహారంలో మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాత్రికి రాత్రే సక్రమమైన అనుమతులున్న భూములు 22ఏలోకి వెళ్లడంతో సాధారణ ప్రజలు బ్యాంకు లోన్లు తీసుకునే వెసులుబాటు కోల్పోయారన్నారు. దీనికి మంత్రి పొంగులేటి బాధ్యత వహించాలన్నారు. అప్పటి వరకు ఆయనను కలెక్టరేట్ దాటనివ్వబోమని భీష్మించారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కలిసి కలెక్టరేట్లోని సమావేశంలో హాల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: Indian Stock Market | ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు