Stock Market | లాభాలతో ముగిసిన సూచీలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. కనిష్ట స్థాయిల వద్ద పలు లార్జ్ క్యాప్ కంపెనీలలో వాల్యూ బయ్యింగ్‌కు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండడంతో ఇండెక్స్‌లు కోలుకున్నాయి. రిలయన్స్ ముందుండి నడిపించడంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగిశాయి.

Stock Market | ఒడిదుడుకుల మధ్య సాగి..

సెన్సెక్స్  బుధవారం ఉదయం 394 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 277 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 877 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో ప్రారంభమెనా 60 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 293 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 75,318 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 23,659 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market | పవర్, ఆయిల్ సెక్టార్లలో దూకుడు..

పవర్, ఎనర్జీ, ఆయిల్ సెక్టార్లలో దూకుడు కనిపించింది. నిఫ్టీ (Nifty)లో పవర్ ఇండెక్స్ 1.78 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.59 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.52 శాతం, ఎనర్జీ 1.45 శాతం పెరగ్గా.. మీడియా ఇండెక్స్ 1.45 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.71 శాతం, ఐటీ 0.42 శాతం నష్టపోయాయి.

Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,120 కంపెనీలు లాభపడగా 1,981 స్టాక్స్ నష్టపోయాయి. 209 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 91 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 40 కంపెనీలు 56 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2 లక్షల కోట్ల మేర పెరిగింది.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 12 స్టాక్ లాభపడగా.. 18 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. రిలయన్స్ 2.83 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.33 శాతం, ట్రెంట్ 1.02 శాతం, ఇండిగో 0.99 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.98 శాతం లాభపడ్డాయి.

Top losers : బీఈఎల్ 2.30 శాతం, టెక్ మహీంద్రా 1.85 శాతం, ఎటర్నల్ 1.52 శాతం, టాటా స్టీల్ 1.08 శాతం, హెచ్యూఎల్ 1.01 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Meta Layoffs | ‘మెటా’పైనా ఏఐ ఎఫెక్ట్ .. 8 వేల మంది ఉద్యోగాలకు ఎసరు!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *