Vivo S2 FE 5G : వీవోనుంచి మిడ్ రేంజ్‌లో అద్భుతమైన ఫోన్.. రేపటినుంచి అందుబాటులోకి..

వివో మిడ్ రేంజ్‌లో మరో 5జీ స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది రేపటినుంచి సేల్‌ అందుబాటులో ఉండనుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vivo S2 FE 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ అయిన వీవో.. భారత మార్కెట్‌లో మరో మోడల్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. వీవో ఎస్ 2 ఎఫ్ఈ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అమర్చారు.

ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 10,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ విక్రయాలు అక్టోబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ తోపాటు అమెజాన్‌ (Amazon)లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

Vivo S2 FE 5G | డిస్‌ప్లే..

6.83 ఇంచ్ 1.5కే 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్, 1260 x 2800 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది.
ఐపీ68 /ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ ఉంది.

ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

Vivo S2 FE 5G | కెమెరా సెటప్..

వెనకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ సామర్థ్యం : 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 44డబ్ల్యూ ఫ్లాష్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

రెండు వేరియంట్లలో : స్టెల్లర్ గ్రీన్, జెన్ వైట్, టైటాన్ బ్లాక్ కలర్స్‌లో రెండు వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 38,999.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 42,999.
ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 2,150 వరకు, ఈఎంఐ కొనుగోళ్లపై రూ. 4,300 డిస్కౌంట్ లభించనుంది.

ఇది కూడా చదవండి..: Oct 19 Gold Prices | బంగారం, వెండి ధరలు మళ్లీ అలా.. అంతర్జాతీయ పరిణామాలే కీలకం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *