June 28 Gold Prices | బంగారం, వెండి ధరలు మరింత దిగిరానున్నాయా..? బులియన్​ మార్కెట్​లో మ్యాజిక్​ జరగనుందా..?

వచ్చే మూడు నెలల్లో MCX పసిడి (10 గ్రాములకు) రూ. 1,35,000 వద్ద బలమైన మద్దతు పొందుతుందని, ఆ తర్వాత  రూ. 1,60,000 వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 28 Gold Prices | అంతర్జాతీయంగానే కాకుండా దేశీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు సమీప భవిష్యత్తు (జులై) లో తీవ్ర ఒత్తిడిలోనే కొనసాగే అవకాశం ఉందని బులియన్​ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కానీ రెండు, మూడు నెలల్లోనే మళ్లీ పుంజుకోవచ్చని భావిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, అమెరికన్ డాలర్ కదలికలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయంగా భౌగోళిక – రాజకీయ ఉద్రిక్తతలు కలగలిపి బులియన్ మార్కెట్ గమనాన్ని శాసించనున్నాయని పేర్కొంటున్నారు.

ఈ సందర్భంగా కోటక్ నియో సీనియర్ మేనేజర్ (కమోడిటీస్ రీసెర్చ్) రితేష్ కుమార్ సాహు విశ్లేషణ బులియన్​ మార్కెట్​ను ఆలోచనలో పడేస్తోంది. ఆయన విశ్లేషణ ప్రకార.. ఈ వారం ఆరంభంలో భారీగా పతనం అయిన స్పాట్ బంగారం Gold ఏడు నెలల కనిష్ట స్థాయి నుంచి కాస్త కోలుకున్నప్పటికీ, మొత్తం మీద పరిశీలిస్తే.. ఇన్వెస్టర్లకు ఇంకా బలహీనంగానే ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా అంచనాలకు అనుగుణంగా ఉండటంతో అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గి, పసిడికి స్వల్ప మద్దతు లభించినట్లైంది.

అయినా కూడా లమైన డాలర్, యూఎస్​ ఉద్యోగాల డేటా, ఈ సంవత్సరం చివరలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలు గోల్డ్​పై ఒత్తిడిని పెంచుతున్నాయి.

Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

June 28 Gold Prices | ప్రస్తుత పరిస్థితి..

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ పసిడి ఔన్సుకు దాదాపు $4,022 వద్ద ట్రేడ్ అవుతోంది. దీనికి తక్షణ మద్దతు ధర (Support Price) $3,950 కాగా.. నిరోధకత (Resistance) ధర $4,200 వద్ద ఉంది.

ఒకవేళ గోల్డ్​ ధరలు $3,950 కంటే కూడా తగ్గితే.. అవి ఔన్సుకు $3,800 – $3,400 వరకు క్షీణించవచ్చు. ఒకవేళ అలా కాకుండా $4,200 పైనకు వెళ్తే.. ఔన్సుకు ధర $4,600 – $4,800 వరకు చేరొచ్చు.

June 28 Gold Prices | దేశీయ మార్కెట్​లో…

ప్రస్తుతం ఎంసీఎక్స్ (MCX) బంగారం (10 గ్రాములకు) దాదాపు రూ. 1,43,127 వద్ద ట్రేడ్ అవుతోంది. దీనికి తక్షణ మద్దతు ధర రూ. 1,37,500 కాగా ఉంది. నిరోధకత మాత్రం రూ. 1,45,500గా కొనసాగుతోంది.

ఒకవేళ ఈ ధరలు మద్దతు స్థాయి కంటే మరింత దిగువకు పడిపోతే.. 24 క్యారెట్​ గోల్డ్​ (10 గ్రాములకు) రూ. 1,34,000 – రూ. 1,25,500 వరకు పతనం అయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ నిరోధక స్థాయిని దాటితే మళ్లీ భగభగలే. అంటే బంగారం (10 గ్రాములు) ధర రూ. 1,52,000 – రూ. 1,60,500 వరకు చేరే ప్రమాదం ఉంది.

June 28 Gold Prices | శాంతి ఒప్పంద ప్రభావం..

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పంద ప్రక్రియతో ఉద్రిక్తతలు తగ్గి, సురక్షిత పెట్టుబడిగా పసిడికి ఉన్న డిమాండ్ తగ్గి, రిటర్న్​లు పెరిగినట్లు ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ రవీంద్ర కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముడి చమురు ధరల తగ్గుదల కూడా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించవచ్చని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో మృదువైన వైఖరిని అవలంబించే అవకాశం ఉందని చెప్పుకొచ్చినట్లు గుడ్​ రిటర్న్​ వెబ్​సైట్​ కథనం.

June 28 Gold Prices |

ఇక కేడియా అడ్వైజరీ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అమిత్ గుప్తా అంచనాను పరిశీలిస్తే.. వచ్చే మూడు నెలల్లో MCX పసిడి (10 గ్రాములకు) రూ. 1,35,000 వద్ద బలమైన మద్దతు పొందుతుందని, ఆ తర్వాత  రూ. 1,60,000 వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక MCX వెండి కూడా (కేజీ) రూ. 1,90,000 వద్ద మద్దతును పొందుతుందని, తర్వాత గరిష్టంగా రూ. 2,60,000 వరకు పెరగొచ్చని వివరిస్తున్నారు.

నోట్​: ఈ కథనంలోని ధరలు కేవలం విశ్లేషకుల అంచనాలు మాత్రనేనని పాఠకులు గమనించగలరు.

 

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *