May 24 Gold Rates | స్థిరంగా బంగారం ధర.. ప్రధాన నగరాల్లో నేటి పరిస్థితి ఏమిటంటే!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 24 Gold Rates | ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల Gold Rates నిర్ణయంలో లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడ జరిగే ట్రేడింగ్ ఆధారంగానే ప్రపంచ దేశాల్లో బంగారం ధరలు మారుతూ ఉంటాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం వ్యాపారం అమెరికన్ డాలర్లలో జరుగుతుండటంతో, డాలర్ విలువలో వచ్చే మార్పులు బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. డాలర్ విలువ బలపడితే సాధారణంగా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.

అదే డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ ట్రెండ్స్, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాల ఆధారంగా బంగారం, వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి.

May 24 Gold Rates | మూడు రోజులుగా తగ్గుముఖం

ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత మూడు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి దేశీయ మార్కెట్‌లో ధరలు స్థిరంగా నమోదయ్యాయి. శనివారం ఉన్న రేట్లే ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఉపశమనం లభించినట్లైంది.

దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.1,59,060 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,800గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,290 వద్ద ట్రేడవుతుండగా, కేజీ వెండి ధర Silver Prices రూ.2,85,000గా కొనసాగుతోంది.

May 24 Gold Rates | చెన్నైలో కాస్త ఎక్కువగా

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ Vijaywada నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,800 వద్ద ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం స్వల్పంగా అధిక ధరలు నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,59,210 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,45,950గా కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ వంటి నగరాల్లో కూడా హైదరాబాద్ తరహా ధరలే కొనసాగుతున్నాయి.

అయితే చెన్నైలో మాత్రం బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,60,690 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,47,300గా నమోదైంది.

మొత్తంగా చూస్తే ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ మారకపు విలువలు, ఆర్థిక పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో మళ్లీ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Iran US Tension | మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ అత్యవసర వ్యూహం.. మరో 72 గంటల్లో ఏమి జరగబోతోంది?

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *