Aug 03 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 03 Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంపై చర్చల నేపథ్యంలో చమురు ధరలు దిగివస్తున్నాయి. దీంతో గత సెషన్‌లో అమెరికా(America) స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది.

అయితే సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty) ప్రీమియంతో ఉండడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.

Aug 03 Horoscope | గత పెట్టుబడులతో బంపర్ లాభాలు..ఈ రాశుల వారు జాక్‌పాట్ కొట్టినట్టే!

Aug 03 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1 శాతం, ఎస్ అండ్ పీ 0.70 శాతం లాభపడ్డాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.48 శాతం లాభంతో ఉంది.

Aug 03 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.27 శాతం నష్టపోగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.28 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.07 శాతం పెరిగాయి.

Aug 03 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.93 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.05 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 3.56 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.44 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.61 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.03 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.72 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Aug 03 Market Analysis | గమనించాల్సిన అంశాలు..

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా నాలుగో సెషన్‌లోనూ తమ కొనుగోళ్ల పరంపరను కొనసాగించారు. గత సెషన్‌లో నికరంగా రూ. 277 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.

  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 2,260 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు బలపడి 95.39 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.74 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.70 వద్ద ఉన్నాయి.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.26 నుంచి 1.39 కు పెరిగింది.
  • విక్స్ 3.29 శాతం తగ్గి 11.75 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 83.80 డాలర్ల వద్ద ఉంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం సోమవారం ప్రారంభం కానుంది. ఆగస్టు 5న గవర్నర్ సంజయ్ మల్హోత్రా విధాన ఫలితాన్ని ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై కేంద్ర బ్యాంక్ అంచనాలు, వడ్డీ రేట్లపై ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న అంశాన్ని పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *