OPPO A6c 5G |  తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : OPPO A6c 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అయిన ఒప్పో కొత్త బడ్జెట్ 5 జీ ఫోన్‌ను తీసుకువచ్చింది. ఒప్పో ఏ6సీ పేరుతో భారత మార్కెట్ (Indian Market)లో విడుదల చేసింది. భారీ బ్యాటరీ, అధునాతన ప్రాసెసర్‌తో తీసుకువచ్చిన ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ (Smartphone) స్పెసిఫికేషన్స్ పరిశీలిస్తే..

OPPO A6c 5G | డిస్‌ప్లే..

6.75 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ , 1570 720 పిక్సల్స్ రిజల్యూషన్ , ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.

OPPO A6c 5G | సాఫ్ట్‌వేర్..

యునిసాక్ టీ7250 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

కెమెరా సెటప్ : వెనకవైపు 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ మోనో క్రోమ్ లెన్స్ తో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ సామర్థ్యం : 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5 వాట్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఆరేళ్లపాటు మన్నుతుందని కంపెనీ చెబుతోంది.

వేరియంట్స్ : ఒప్పో ఏ6సీ ఫోన్ ఫెదర్ వైట్, స్టోన్ బ్రౌన్ కలర్స్‌లో, రెండు స్టోరేజ్ వేరియంట్స్ లో విడుదలయ్యింది.
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 13,999.
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 16,999.

ఇది కూడా చదవండి..: Byju Raveendran Jail | బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు 6 నెలల జైలు శిక్ష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *