Tata Tiago Facelift | మధ్య తరగతి కోసం మరో కారు.. మే 28న లాంచ్ చేయనున్న టాటా

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tata Tiago Facelift | దేశీయ ఆటోమొబైల్ రంగ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors).. మధ్యతరగతి కోసం మరోసారి బడ్జెట్ కారును తీసుకువస్తోంది. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగోను సరికొత్త అవతారంలో లాంచ్ చేయబోతోంది.

2026 టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ పేరుతో ఈనెల 28న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇది మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ10 కార్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. టెస్టింగ్ సమయంలో లీకైన సమాచారం మేరకు మధ్యతరగతి బడ్జెట్ ధరలో తీసుకువస్తున్న ఈ కారు ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.

Tata Tiago Facelift | ఎక్స్‌టీరియర్ డిజైన్ ..

కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్ వెలుపలి డిజైన్‌లో టాటా మోటార్స్ పలు మార్పులు చేసింది. కారు ముందు భాగంలో ఎలఈడీ హెడ్‌లైట్లు , డే టైమ్ రన్నింగ్ లైట్లు, కారు మెక వైపు స్టైలిష్ ఎలఈడీ టెయిల్ లైట్లను అమర్చారు. రెండు హెడ్‌లైట్లను కలుపుతూ మధ్యలో ఒక క్రోమ్ లేదా గ్లోసీ బ్లాక్ పట్టీ ఇచ్చారు. ఫాగ్ ల్యాంప్స్ పొజిషన్ కూడా కిందికి మారింది. కారుకు మరింత స్పోర్టీ లుక్ ను ఇచ్చేందుకు జామెట్రిక్ ప్యాటర్న్ డిజైన్‌తో కూడిన డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్‌ను ఇచ్చారు.

Tata Tiago Facelift | కారులోపల సౌకర్యాలు..

టాటా లేటెస్ట్ టూ స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 10.25 ఇంచుల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లున్నాయి. ఇందులో సరికొత్త 7 ఇంచుల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ సెంటర్ ఆమ్‌రెస్ట్, వెనుక సీట్ ప్రయాణికుల కోసం రేర్ ఏసీ వెంట్స్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, మెక వైపు ఆమ్‌రెస్ట్ వంటి సౌకర్యాలను పొందుపరిచారు. 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండనుంది.

Tata Tiago Facelift | ఇంజన్ ఆప్షన్స్..

ఈ కారులో 1.2 లీటర్, 3 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కొనసాగించనున్నారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మైలేజ్ ప్రియుల కోసం టాటా పేటెంటెడ్ ఐసీఎన్‌జీ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ కూడా ఇందులో లభిస్తుంది. అలాగే ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. మరింత పవర్ కోరుకునే వారి కోసం 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Tata Tiago Facelift | ధర ఎంత ఉండొచ్చంటే..

పాత టాటా టియాగో ఎక్స్ షోరూమ్ ధర రూ.4.60 లక్షల నుంచి రూ.8.20 లక్షల వరకు ఉంది. సరికొత్త అప్‌డేట్స్, అధునాతన ఫీచర్ల కారణంగా కొత్త 2026 టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర దాదాపు రూ. 5 లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: ఆసియా మార్కెట్‌పై బేన్ క్యాపిటల్ పట్టు.. ఇండియా, జపాన్ లలో విస్తరణకు ప్రణాళికలు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *