Hi-Tech Engineers IPO | హైటెక్ ఇంజినీర్స్.. లిస్టింగ్ అదుర్స్

హై-టెక్ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో అదరగొట్టాయి. ఐపీవో ఇన్వెస్టర్లకు 40 శాతానికిపైగా లాభాలను అందించాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hi-Tech Engineers IPO | హైడ్రాలిక్స్ పరిశ్రమలో 40 ఏళ్లకుపైగా అనుభవం కలిగి ఉన్న హై-టెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవోకు వచ్చింది. ఆగస్టు 24న ప్రారంభమైన ఐపీవో సబ్‌స్క్రిప్షన్.. ఆగస్టు 27న ముగిసింది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 135.73 కోట్లు సమీకరించింది.

Hi-Tech Engineers IPO | భారీ స్పందన..

చిన్న ఇష్యూ కావడంతో ఇన్వెస్టర్లనుంచి ఈ కంపెనీ ఐపీవో (IPO)కు భారీ స్పందన లభించింది. మొత్తం ఐపీవో 247.39 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 249.71, ఎన్ ఐఐ కోటా 412.96, రిటైల్ కోటా 175.10 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

Hi-Tech Engineers IPO | 41.51 శాతం ప్రీమియంతో..

కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ ఒక్కో షేరును రూ. 53 కి విక్రయిచగా.. రూ. 75 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 41.51 శాతం లాభాలు వచ్చాయన్న మాట.

Hi-Tech Engineers IPOసర్క్యూట్ ఆట..

హై-టెక్ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ ఆట ఆడుకున్నాయి. 41.51 శాతం ప్రీమియంతో లిస్టయిన వెంటనే షేరు ధర మరో ఐదు శాతం పెరిగి రూ. 78.50 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో పది శాతం పడిపోయి రూ. 71.25 వద్ద లోయర్ సర్క్యూట్ కొట్టాయి. కొద్ది సేపటి తర్వాత కోలుకుని మళ్లీ అప్పర్ సర్క్యూట్ కొట్టాయి.

ఇది కూడా చదవండి..: Sep 01 Gold Prices | తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. వెండి పరిస్థితి ఏమిటంటే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *