అక్షరటుడే, వెబ్‌డెస్క్: Army Regiment Theft | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో అత్యంత భద్రత ఉంటే మద్రాస్ రెజిమెంట్ నుంచి 12 ఆయుధాలు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఆయుధాలను భద్రపరిచిన గది తాళాన్ని పగలగొట్టి వాటిని తీసుకువెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సైనిక అధికారులు బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీకి అనుబంధంగా అనేక రెజిమెంట్లు ఉన్నాయి. అందులో మద్రాస్ రెజిమెంట్ కూడా ఒకటి. సైనిక సిబ్బంది ఆయుధాలను నిల్వ చేసే ఒక విభాగం ఇక్కడ ఉంది. ఇందులోకి అందరికి ప్రవేశం ఉండదు. అలాంటి ఆయుధ గదిలో చోరీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక (ఇన్సాస్) రైఫిల్, మందుగుండు సామగ్రి ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సీనియర్ ఆర్మీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Army Regiment Theft | సిబ్బందే చేశారా..
ఆ ప్రాంతంలోకి బయటికి వ్యక్తులకు ప్రవేశం ఉండదు. భారీ భద్రత ఉంటుంది. దీంతో రెజిమెంట్‌లో పని చేసే సిబ్బంది ప్రమేయం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆర్మీ అధికారులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీకి సంబంధించిన కేసు కావడంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు చెందిన సీనియర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Moosarambagh Bridge | విశ్వనగరంగా హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి