Moosarambagh Bridge | విశ్వనగరంగా హైదరాబాద్​ : సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్‌ విశ్వనగరంగా మారిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moosarambagh Bridge | హైదరాబాద్‌ (Hyderabad) విశ్వనగరంగా మారిందని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నగరం అన్ని వర్గాల వారికి ఆశ్రయమిచ్చిందన్నారు. ప్రపంచంతో పోటీ పడుతోందని పేర్కొన్నారు.

అంబర్​పేట్​–మూసారాంబాగ్​ బ్రిడ్జిని సీఎం రేవంత్​రెడ్డి సోమవారం ప్రారంభించారు. మూసీ నదిపై రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవునా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఇది అందుబాటులోకి రావడంతో మూసారాంబాగ్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గి రాకపోకలు వేగవంతం కానున్నాయి. బ్రిడ్జి ప్రారంభించిన అనంతరం సీఎం బహిరంగ సభలో మాట్లాడారు. నగరంలో జనాభా పెరుగుతోందన్నారు. అందుకు అనుగుణంగా మౌలిక వసతులు పెరగడం లేదని చెప్పారు.

Moosarambagh Bridge | అంబర్​పేటలో అనేక సమస్యలు

అంబర్‌పేట నియోజకవర్గంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం అన్నారు. మూసీ పక్కన నివసించే పేదలను చూడలేని పరిస్థితి ఉందన్నారు. కాస్త వర్షం పడితే చాలు బ్రిడ్జిపైనుంచి నీరు ప్రవహిస్తుందని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఈ వంతెనను ఎందుకు కట్టలేదని విమర్శించారు.

Moosarambagh Bridge | బతుకమ్మ కుంట కబ్జాకు యత్నం

బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో బతుకమ్మ కుంటను కబ్జా చేశారని సీఎం ఆరోపించారు. మున్సిపల్ మంత్రికి కబ్జాల్లో తోడుండే వ్యక్తి ఆక్రమణలకు పాల్పడ్డారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. హైడ్రాను తీసుకొచ్చి కుంటను పునరుద్ధరించామని చెప్పారు. అయితే కోర్టు కేసులు వేసి కొందరు మళ్లీ కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్​ఎస్​కు చెందిన ఎడ్ల సుధాకర్​ రెడ్డి అనే వ్యక్తి బతుకమ్మ కుంటను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కేసీఆర్​ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామన్నారు.

Moosarambagh Bridge | లోగోల ఆవిష్కరణ

మూడు కార్పొరేషన్ల కొత్త లోగోలను సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. జీహెచ్​ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల కొత్త లోగోలు ఆవిష్కరించారు. ప్రభుత్వం జీహెచ్​ఎంసీని విభజించి మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

దీనిని కూడా చదవండి : Kavitha Panchajanya Sabha | పిరికిదాన్ని కాదు.. పిడికిలి బిగించి మీముందుకొచ్చా.. కన్నీళ్లతో ప్రసంగించిన కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *