IVF Services | ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు : మంత్రి రాజనర్సింహ

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : IVF Services | రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Rajanarsihma) సూచించారు. ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో ఏఆర్‌‌టీ, సరోగసి చట్టాల అమలును కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘించే ఐవీఎఫ్​ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గాంధీ హాస్పిటల్ (Gandhi Hospital), పేట్లబుర్జు హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ల పనితీరుపై ఆరా తీశారు. రెండు సెంటర్లలో ఇప్పటివరకు 39,802 మందికి ఫర్టిలిటీ సేవలు అందించామని అధికారులు తెలిపారు.

IVF Services | జిల్లాల్లో సైతం..

గాంధీ హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సెంటర్‌ను 2024 అక్టోబర్‌లో, పేట్లబుర్జులోని ఎంజీఎంహెచ్‌లో 2024 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఈ రెండు సెంటర్లలో సేవలను బలోపేతం చేయడంతో పాటు, జిల్లాల్లోనూ దశలవారీగా ఐవీఎఫ్ సేవలను విస్తరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

IVF Services | కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో అధికారులు నిర్వహించిన తనిఖీలపై మంత్రి ఆరా తీశారు. 379 సెంటర్లను తనిఖీ చేయగా, 50 సెంటర్లలో డీవియేషన్స్‌ గుర్తించినట్లు హెల్త్‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, సంగీత సత్యానారాయణ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 2 సెంటర్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేయగా, 9 సెంటర్ల అనుమతులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే సెంటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : Firecracker Factory Blast | యూపీలో తీవ్ర విషాదం.. బాణాసంచా కేంద్రం పేలి 8 మంది మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *