అక్షరటుడే, వెబ్డెస్క్ : El Nino Effect | తెలంగాణ (Telangana) వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. రెండు రోజుల క్రితం అక్కడక్కడ జల్లులు కురిసినా భారీ వర్షాలు కరువు అయ్యాయి. రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలో మంగళవారం వేడి, తేమతో కూడిన వాతావరణం నెలకొంటుంది. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇవి విస్తారమైన వానలు కావు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము సమయాల్లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం మరియు భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
El Nino Effect | సెప్టెంబర్ 15 వరకు..
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో సెప్టెంబర్ 15 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే లోటు వర్షపాతం నమోదు అయింది. రానున్న రోజుల్లో అది మరింత పెరగనుంది. సెప్టెంబర్ వచ్చినా.. ప్రధాన జలాశయాలు ఇంకా నిండలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే సెప్టెంబర్ 15 తర్వాత మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Secunderabad Arms Theft | సికింద్రాబాద్లో భారీగా ఆయుధాల చోరీ.. మద్రాస్ రెజిమెంట్లో కలకలం