Aakash Invictus Engineering 2.0 | ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ‘ఆకాష్ ఇన్విక్టస్-2.0’ లాంచ్!

దేశంలోనే ప్రముఖ ప్రవేశ పరీక్షల శిక్షణ సంస్థ అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) ఇంజినీరింగ్ ఆశావాహుల కోసం సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Aakash Invictus Engineering 2.0 | దేశంలోనే ప్రముఖ ప్రవేశ పరీక్షల శిక్షణ సంస్థ అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) ఇంజినీరింగ్ ఆశావాహుల కోసం సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ , వివిధ రాష్ట్రాల సీఈటీ (CET) పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మరింత మేలు చేసేలా అత్యంత అధునాతనమైన ‘ఆకాష్ ఇన్విక్టస్‌–ఇంజినీరింగ్‌ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది.

విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా తమ గరిష్ట సామర్థ్యాన్ని సాధించేలా ఈ శిక్షణ వ్యవస్థను రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆకాష్ శాఖల్లో ఇది తక్షణమే అమల్లోకి రానుంది. ముందుగా సంస్థలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులను ఈ విధానంలోకి మారుస్తారు.

Aakash Invictus Engineering 2.0 | ప్రత్యేక శిక్షణ..

ఈ విద్యా విధానం ప్రధానంగా ఆరు ప్రత్యేక సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. ప్రతి తరగతి, సాధన , పునశ్చరణ ప్రక్రియను జేఈఈ, బిట్స్‌ఏటీ (BITSAT) వంటి పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించేలా డిజైన్ చేశారు. అగ్రశ్రేణి ర్యాంకులను సాధించి పెట్టిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందమే ఈ పాఠ్య ప్రణాళిక, పుస్తకాలు , పరీక్షా సరళిని రూపొందించింది. పరీక్షా సరళిపై లోతైన పరిశోధనల ద్వారా పుస్తకాలను తీర్చిదిద్దారు. ఇవి విద్యార్థులను ప్రాథమిక అంశాల నుంచి కఠినమైన ప్రశ్నల వరకు సులభంగా నడిపిస్తాయి. విద్యార్థుల బలాలు, లోపాలను స్పష్టంగా అంచనా వేసేలా పరీక్షల నిర్వహణ, వాటి కఠినతను పూర్తిగా మార్చారు. విద్యార్థి ప్రస్తుత స్థాయి ఏమిటి, లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనే అంశంపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు స్పష్టత ఉంటుంది. తరగతి వేళలతో సంబంధం లేకుండా నిరంతర మార్గదర్శకత్వం, సందేహాల నివృత్తితో పాటు జోసా (JoSAA) కౌన్సిలింగ్‌లోనూ ప్రత్యేక సాయం అందిస్తారు.

Aakash Invictus Engineering 2.0 \ నాలుగు ప్రత్యేక బ్యాచ్‌లు..

విద్యార్థుల అభ్యాస శైలికి తగినట్లుగా ఆకాష్ ఇన్విక్టస్‌లో నాలుగు ప్రత్యేక బ్యాచ్‌లను పరిచయం చేశారు. అవి: ఏస్ (Ace), అచీవర్ (Achiever), యాక్సిలరేటర్ (Accelerator), అపెక్స్ (Apex). విద్యార్థుల లక్ష్యాలకు అనుగుణంగా ఇవి సమానమైన శిక్షణ మార్గాలను అందిస్తాయి.

ఈ సందర్భంగా ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండీ, సీఈవో చంద్రశేఖర్ రెడ్డి గరిస మాట్లాడుతూ.. కొద్ది కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. జేఈఈ ఫలితాలు ఆకాష్ చరిత్రలోనే అత్యుత్తమంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి విద్యార్థులు , తల్లిదండ్రులు 7303759494 నంబర్ ద్వారా లేదా support.invictus@aesl.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

ఇది కూడా చదవండి:  Stock Market Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *