అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sensex Nifty | దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం గందరగోళం నెలకొంది. ఒకదశలో నిఫ్టీ 200లకుపైగా పాయింట్లు నష్టపోగా.. ఇదే సమయంలో సెన్సెక్స్ 400లకుపై పాయింట్ల లాభంతో ఉంది. బెంచ్‌మార్క్ సూచీల మధ్య అరుదైన వ్యత్యాసానికి కారణం కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్.
ఎఫ్ అండ్ వో స్టాక్‌ల కోసం సోమవారం నుంచి కొత్త ఆక్షన్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని వల్ల గత సెషన్ చివరలో నిఫ్టీ (Nifty) అకస్మాత్తుగా 200 పాయింట్లకుపైగా ఎగబాకింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీల మధ్య ముగింపు ధరలలో వ్యత్యాసం ఏర్పడింది. ఆ వ్యత్యాసం మంగళవారంనాటి ట్రేడింగ్‌లో అడ్జస్ట్ కావడంతో రెండు సూచీల మధ్య తేడా ఎక్కువగా కనిపిస్తోంది.
Sensex Nifty | మిక్స్‌డ్ గా ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం మిక్స్‌డ్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 493 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 11 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 516 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 134 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 21 పాయింట్ల లాభంతో 78,659 వద్ద, నిఫ్టీ 197 పాయింట్ల నష్టంతో 24,576 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్స్ లాభాలతో, 9 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్ 1.90 శాతం, ఆసియన్ పెయింట్ 1.41 శాతం, ఎం అండ్ ఎం 1.23 శాతం, టాటా స్టీల్ 1.16 శాతం, బీఈఎల్ 1.06 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.94 శాతం, హెచ్యూఎల్ 0.94 శాతం, ఇన్ఫోసిస్ 0.90 శాతం, రిలయన్స్ 0.75 శాతం, ఇండిగో 0.09 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Aug 04 Gold Prices | అమెరికా–ఇరాన్ అనిశ్చితి ప్రభావం.. స్థిరంగా బంగారం ధర!