Udhayanidhi Stalin Arrest | ఉదయనిధి స్టాలిన్​ అరెస్ట్​

తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Udhayanidhi Stalin Arrest | తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు సీఎం విజయ్, నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యలు చేశారని ఆయనపై తంజావూర్ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు అయింది.

ఉదయనిధి స్టాలిన్​ సోమవారం కావేరి జలాలపై నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం విజయ్​, నటి త్రిష (Actress Trisha)ను ఉద్దేశించిన ఆయన డబుల్​ మీనింగ్​ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని టీవీకే ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. అంతేగాకుండా జాతీయ మహిళా కమిషన్​ను సైతం ఆశ్రయించింది.

Udhayanidhi Stalin Arrest | బెయిల్​ పిటిషన్​ దాఖలు

టీవీకే నాయకుల ఫిర్యాదు మేరకు ఉదయనిధి స్టాలిన్​పై ఆరు సెక్షన్ల కింద తంజావూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్​ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం విచారణ జరగనుంది. అంతలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తమిళనాడులో హైటెన్షన్​ నెలకొంది. ఉదయనిధి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీవీకే నాయకులు నిరసనలు తెలుపుతుండగా.. ఆయన అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ డీఎంకే నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Greater Noida Fire | మంటలు ఆర్పుతుండగా కూలిన గోడ.. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *