Pocharam Project | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్ట్​.. ఖరీఫ్​కు భరోసా

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్​ పొంగిపొర్లుతుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగిరెడ్డిపేట (Nagireddypeta)లోని పోచారం ప్రాజెక్ట్​ పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టు నిండడంతో పరిసర ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Pocharam Project | పూర్తిస్థాయికి చేరుకున్న నీటిమట్టం

ప్రాజెక్ట్​లో ఇన్​ఫ్లో 2,200 నుంచి 5,207 క్యూసెక్కులకు పెరిగింది. సోమవారం ఉదయం 11గంటలకు ప్రాజెక్ట్​ నీటి మట్టం 1464.00 అడుగులు (1.820 టీఎంసీలు) కాగా అదేస్థాయిలో నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఇన్‌ఫ్లో 5,207 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం కాలువలకు నీటి విడుదల చేయట్లేదు. మిగులు నీరు ప్రాజెక్ట్​పై నుంచి పొంగి మంజీరలోకి వెళ్తోంది. లింగంపేట పెద్దవాగు, గుండారం వాగుల ద్వారా భారీగా వదర వస్తోంది.

Pocharam Project | అప్రమత్తత అవసరం

ప్రాజెక్ట్​ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. నదులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్​ నిండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాబోయే ఖరీఫ్​, వానాకాలం పంటలకు సాగునీటి కొరత ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశముందని రైతులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..: SRSP Water Level | కొనసాగుతున్న వరద.. ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటిమట్టం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *