Indigenous Turbojet Engine | ఆజాద్ ఇంజనీరింగ్, డీఆర్‌డీవో ఘనతపై కేటీఆర్ హర్షం

ఆజాద్ ఇంజనీరింగ్ మరియు డీఆర్‌డీవో (DRDO) సంయుక్తంగా సాధించిన గొప్ప విజయానికి గాను భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Indigenous Turbojet Engine | ఆజాద్ ఇంజనీరింగ్ ,  డీఆర్‌డీవో (DRDO) సంయుక్తంగా సాధించిన గొప్ప విజయానికి గాను భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. 350 కేజీల బరువున్న మొట్టమొదటి స్వదేశీ థ్రస్ట్-క్లాస్ ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్‌ను విజయవంతంగా తయారు చేయడం హైదరాబాద్‌తో పాటు దేశం మొత్తానికీ గర్వకారణమైన మైలురాయి అని కేటీఆర్ అభివర్ణించారు.

Indigenous Turbojet Engine | రక్షణ రంగంలో ఆత్మనిర్భరత..

భారతదేశ స్వదేశీ ప్రొపల్షన్ సామర్థ్యాలను, రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను (స్వావలంబన) ఈ ఘనత మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఏరోస్పేస్, ప్రిసిషన్ ఇంజనీరింగ్ రంగాలు సాధిస్తున్న పురోగతికి ఈ జెట్ ఇంజిన్ ఉత్పత్తి ఒక చక్కని నిదర్శనమని తెలిపారు. ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ ఖ్యాతిని ఈ విజయం మరింత ఇనుమడింపజేసిందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Udhayanidhi Stalin Arrest | ఉదయనిధి స్టాలిన్​ అరెస్ట్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *