అక్షరటుడే, మెండోరా: SRSP Water Level | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో ఎస్సారెస్పీ నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో ఆశాజనకంగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
SRSP Water Level | ఉదయం 9గంటలకు..
శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం 9 గంటల వరకు 28,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1,075.50 అడుగుల వద్ద 33.857 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1,078.10 అడుగుల వద్ద 40.025 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం సుమారు 7 టీఎంసీల మేర తక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 403 క్యూసెక్కులు కలిపి మొత్తం 934 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు కొనసాగుతుండటంతో శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: TNGOs Bonalu | 5న టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో బోనాలు