అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Drone Restrictions | ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఈ నెల 10వ తేదీన బేగంపేట పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రజాసభ నేపథ్యంలో పారా గ్లైడర్లు, డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎగుర వేతలపై నిషేధం విధించారు.
Hyderabad Drone Restrictions | భద్రతా పరిరక్షణ దృష్ట్యా
బోయిన్‌పల్లి, బేగంపేట, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మే 10వ తేదీన ఉదయం 00:00 గంటల నుంచి రాత్రి 24:00 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల భద్రత, భద్రతా పరిరక్షణ దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించాలని, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉల్లంఘనలు చోటుచేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Vijay Oath Confusion | విజయ్ ప్రమాణ స్వీకారంపై మళ్లీ సందిగ్ధత.. కారణం ఏమిటంటే..!

