అక్షరటుడే వెబ్డెస్క్: Temple Shoes Lost | సాధారణంగా ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు తమ చెప్పులు పోతే ఆ రోజు టైం బాలేదని బాధపడతారు. అలాగే ఆందోళన చెందడం, కోపానికి గురికావడం సహజం. కానీ, మన జ్యోతిష్య శాస్త్రం ( Astrology ) ప్రకారం గుడి వద్ద చెప్పులు పోవడం అస్సలు అశుభం కాదు, అది ఒక అదృష్టానికి సంకేతం అని పండితులు చెబుతున్నారు. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Temple Shoes Lost | శని దోషాల నుండి విముక్తి..
జ్యోతిష్య శాస్త్రంలో పాదాలకు, మనం ధరించే పాదరక్షలకు శని గ్రహంతో విడదీయలేని సంబంధం ఉంది. శని దేవుడి ప్రభావం ప్రధానంగా పాదాలపైనే ఉంటుంది. కాబట్టి, గుడి బయట మీ చెప్పులు పోయాయంటే, మీ జీవితాన్ని పీడిస్తున్న శని దోషాలు, ప్రతికూల శక్తులు ఆ చెప్పులతో పాటే తొలగిపోయాయని అర్థం. ముఖ్యంగా శని ప్రభావంతో ఇబ్బందులు పడేవారికి ఇది ఒక రకమైన ఉపశమనం వంటిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Temple Shoes Lost | జీవితంలో కొత్త మార్పులకు శ్రీకారం..
గుడిలో చెప్పులు పోవడం అనేది జీవితంలో మంచి రోజులు మొదలైనదనడానికి ఒక శుభ సంకేతం. ఇలా జరిగిన తర్వాత పెండింగ్లో ఉన్న పనులు సజావుగా పూర్తికావడం, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభించడం, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోవడం వంటి శుభ పరిణామాలు జరుగుతాయని నమ్ముతారు. ఒకవేళ శనివారం రోజున, శని దేవుడి లేదా హనుమంతుడి ఆలయాల వద్ద ఇది జరిగితే అది మరింత విశేషంగా పరిగణిస్తారు.
Temple Shoes Lost | పాటించాల్సిన నియమాలు..
ఆలయ ప్రాంగణంలో చెప్పులు పోయినప్పుడు కంగారు పడకుండా, శాస్త్రం సూచించిన కొన్ని జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. ముఖ్యంగా, అక్కడ వేరే ఎవరిదైనా చెప్పులను పొరపాటున కూడా వేసుకోకండి. అలా చేస్తే వారి నెగెటివిటీ మీకు అంటుకునే అవకాశం ఉంది. కోపం, నిరాశలకు లోనుకాకుండా, దైవ సంకల్పంగా భావించి ప్రశాంతంగా ఉండండి. ఆలయ పరిసరాల్లో కొత్త చెప్పులు కొనుక్కుని, “నా దోషాలన్నీ తొలగిపోయాయి, అంతా మంచే జరుగుతుంది” అనే సానుకూల దృక్పథంతో ఇంటికి వెళ్లడం మంచిది.
ఇది కూడా చదవండి: TGPSC Notification | ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ