Prakash Raj Vote | వీడియో పెడితేనే ఓటా?.. ఈసీ అధికారులపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

లక్టోరల్ రోల్ (SIR) ప్రక్రియలో భాగంగా నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు అంశంపై వివాదం ఇంకా కొనసాగుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Prakash Raj Vote | ఎలక్టోరల్ రోల్ (SIR) ప్రక్రియలో భాగంగా నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు అంశంపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ప్రకాశ్ రాజ్ ఓటును నిబంధనల ప్రకారమే మార్చామని, ఆయన ఫారమ్-6 సమర్పించి ఓటు హక్కును తిరిగి పొందవచ్చని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ప్రకాశ్ రాజ్ ‘ఎక్స్’ వేదికగా మరో వీడియోను విడుదల చేస్తూ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను వీడియో చేయడంతోనే అధికారులు హుటాహుటిన తన ఓటును మళ్లీ నమోదు చేశారని, మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తాను వీడియో పెట్టిన గంటల వ్యవధిలోనే మిలియన్ల మంది చూశారని, ఆ వెంటనే అధికారులు తనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని, సరిదిద్దుతామని చెప్పారన్నారు.

Prakash Raj Vote | తప్పుడు ప్రచారం చేస్తున్నారని..

అయితే, సాయంత్రానికల్లా తాను ఆ అడ్రస్‌లో ఉండటం లేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తాను చెప్పినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన అన్ని కాల్ రికార్డులు తన వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు. సాయంత్రానికి బీఎల్ఓను కెమెరాతో పంపి చుట్టుపక్కల వారితో మాట్లాడించి గోదీ మీడియా హల్ చల్ చేసిందని ఆయన విమర్శించారు. ఇదంతా ఎలాంటి నాటకం, ఇదేం రాజకీయం అంటూ అధికారులను నిలదీశారు.

ఇది కూడా చదవండి:  Kiren Rijiju | విపక్షాలపై కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు ఆగ్రహం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *