అక్షరటుడే వెబ్‌డెస్క్: Jawa Yezdi Festive Offers | ఈ పండుగ సీజన్లో మోటార్‌సైకిల్ ప్రియులకు జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ పలు ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తోంది. కస్టమర్లు తమకు ఇష్టమైన జావా, యెజ్డీ లేదా BSA బైక్‌లను చాలా సులభంగా సొంతం చేసుకునేలా ఈ ఫైనాన్సింగ్ సొల్యూషన్లను రూపొందించడం జరిగింది.
Jawa Yezdi Festive Offers | జీరో డౌన్ పేమెంట్ ..
పండుగ ఆఫర్లలో భాగంగా, జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ అనేక రకాల సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ సొల్యూషన్ల ద్వారా ఎక్కువ మంది రైడర్లు తమ బైక్‌ను స్వంతం చేసుకునే స్థాయికి చేరుకోవడానికి సహాయం చేస్తోంది. వినియోగదారులు 100% వరకు ఫండింగ్ , జీరో డౌన్ పేమెంట్‌తో ఫైనాన్సింగ్ పరిష్కారాలను పొందవచ్చు. ఇది వారి ఓనర్షిప్ ప్రస్థానాన్ని ప్రారంభించడానికి అవసరమైన అప్‌ఫ్రంట్ కమిట్మెంట్ను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.
Jawa Yezdi Festive Offers | తక్కువ వడ్డీ రేట్లు..
72 నెలల వరకు కాలపరిమితి , 5.99% నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో సహా సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఇవి ఎక్కువ మంది రైడర్లకు ఓనర్‌షిప్‌ను మరింత సౌకర్యవంతంగా , అందుబాటులో ఉండేలా రూపొందించడం జరిగింది. పండుగ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్‌లో తక్షణ ఆమోద ప్రక్రియలు కూడా ఉండటంతో వేగవంతమైన, సునాయాసమైన కొనుగోలు అనుభవం లభిస్తుంది.
Jawa Yezdi Festive Offers | ప్రత్యేక సదుపాయాలు ..
అర్హులైన కస్టమర్లు ‘ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి’ (బై నౌ పే లేటర్) ఆప్షన్‌తో లబ్దిని పొందవచ్చు, ఇది పండుగ సమయంలో అదనపు సౌలభ్యాన్ని ఇస్తుంది. ఎంపిక చేసిన పథకాలు హైపోథెకేషన్ ప్రయోజనాలను అందించవు. అదే సమయంలో, మహీంద్రా గ్రూప్ ( Mahindra group ) ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రామ్‌ల కింద వారు అదనపు ఓనర్షిప్ లబ్ధులను పొందవచ్చు. ఈ సొల్యూషన్లు అన్నీ కలిసి రైడర్లకు తమ డ్రీమ్ బైక్‌ను సొంతం చేసుకోవడానికి అనేక మార్గాలను అందిస్తున్నాయి.
Jawa Yezdi Festive Offers | నిపుణుల మాట..
ఈ సందర్భంగా క్లాసిక్ లెజెండ్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ థరేజా మాట్లాడుతూ.. చాలా మంది రైడర్లకు జావా, యెజ్డీ లేదా BSA వంటి మోటార్‌సైకిల్‌ను స్వంతం చేసుకోవడం అనేది కేవలం ఒక బండిని ఇంటికి తెచ్చుకోవడం మాత్రమే కాదని, అది ఒక ప్రత్యేకమైన మోటార్‌సైక్లింగ్ సంస్కృతిలో భాగం కావడం లాంటిదని పేర్కొన్నారు. ఈ పండుగ సీజన్లో మరింత సౌలభ్యం, సౌకర్యాన్ని అందించే ఫైనాన్సింగ్ సొల్యూషన్ల ద్వారా ఆ ఆకాంక్షను నెరవేర్చుకోవడాన్ని సులభం చేస్తున్నామని తెలిపారు. ఈ ఆఫర్లు మొదటి అడుగును సులభం చేయడానికి రూపొందించాయని, తద్వారా ఎక్కువ మంది రైడర్లు ఈ కమ్యూనిటీలో చేరడానికి వీలు కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ACB Trap | 22-ఏ భూమి కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్