అక్షరటుడే వెబ్‌డెస్క్: Trump South Korea Military Drills| ఇరాన్ విషయంలో అమెరికాకు మద్దతుగా నిలవడానికి మిత్రదేశమైన దక్షిణ కొరియా విముఖత వ్యక్తం చేసింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి షాకిచ్చారు. దక్షిణ కొరియాతో నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని తన రక్షణ శాఖను ఆదేశించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఉన్న సత్సంబంధాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్’ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
Trump South Korea Military Drills | ట్రంప్ పోస్టులోని అంశాలు..
కిమ్‌తో తనకున్న మంచి స్నేహ బంధం దృష్ట్యా, దక్షిణ కొరియాతో చేపట్టాల్సిన సంయుక్త సైనిక చర్యలను తగ్గించాలని అనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ సైనిక విన్యాసాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవని, దీనికి సంబంధించిన ఎక్కువ వ్యయాన్ని అమెరికానే భరిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైందని అభిప్రాయపడ్డారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునే చర్యల్లో అమెరికాతో కలిసి రావాలని దక్షిణ కొరియా అధ్యక్షుడిని కోరినప్పటికీ.. వారు సుముఖత వ్యక్తం చేయలేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం దక్షిణ కొరియా మాత్రమే కాకుండా జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి ఇతర మిత్రదేశాలు కూడా ఇరాన్ విషయంలో తమకు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, ఈ పోస్ట్ చేయడానికి కొద్ది గంటల ముందే 2019లో కిమ్‌తో దిగిన పాత ఫోటోను ట్రంప్ షేర్ చేయడం గమనార్హం.
Trump South Korea Military Drills | ప్రస్తుత పరిస్థితులు..
అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త ఆధ్వర్యంలో ‘ఉల్చి ఫ్రీడం షీల్డ్’ పేరుతో సైనిక విన్యాసాలు ఇటీవల ప్రకటించారు. సోమవారం నుంచి 11 రోజులపాటు జరగనున్న ఈ విన్యాసాల్లో సుమారు 18 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొననున్నారు. అయితే, ట్రంప్ ప్రకటన వెలువడినప్పటికీ షెడ్యూల్ ప్రకారమే ఈ విన్యాసాలు కొనసాగుతాయని సియోల్ స్పష్టం చేసింది. ఇదిలావుండగా, 2018లోనూ కిమ్‌తో అణు చర్చలు జరిపిన సమయంలో ట్రంప్ ఇలాగే అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను నిలిపివేశారు. తాజాగా కిమ్‌తో మళ్లీ స్నేహపూర్వక సంబంధాల గురించి మాట్లాడటం, సైనిక విన్యాసాలను తగ్గించాలని ఆదేశించడంతో.. ఆయన మరోసారి ఉత్తర కొరియాతో చర్చలకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Based on my very good relationship with Kim Jong Un, of North Korea, I am not happy with the fact that the United States has, long ago, agreed to participate in Joint Military Exercises with South Korea. These exercises are not only costly, with much of these costs paid for by… pic.twitter.com/IcVjiJyDX9
— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) August 16, 2026
ఇదిరూడా చదవండి: IPO Listing Gains | అదరగొట్టిన ఐపీవోలు.. భారీ లాభాలను అందించిన ధూత్ ట్రాన్స్మిషన్ ..