Nagababu Cabinet Rank | నాగబాబుకు కేబినెట్ హోదా

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nagababu Cabinet Rank | ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pawan Kalyan) సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Nagababu Cabinet Rank | ఛైర్మన్​గా నాగబాబు

రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం పెంపు, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో పని ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పని చేస్తుంది. దీని ఛైర్మన్​గా నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఈ బాధ్యతలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదాను ఇచ్చింది. కాగా జనసేన నాయకుడు నాగబాబును మంత్రి చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అయితే తాజాగా ప్రభుత్వం కేబినెట్ హోదా ఉన్న పదవి ఇవ్వడంతో మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..: ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *