Akvan Cyclone Telangana | తెలంగాణకు ‘అక్వాన్’ తుపాను ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడనున్న ‘అక్వాన్’ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై గట్టిగా ఉండనుంది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Akvan Cyclone Telangana | బంగాళాఖాతంలో ఏర్పడనున్న ‘అక్వాన్’ (Akvan) తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై గట్టిగా ఉండనుంది. ఈ నెల 20వ తేదీన ఈ తుపాను ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana)లో వాతావరణం పూర్తిగా మారిపోయి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడు కీలక సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా నవంబర్ 20 నుండి 22వ తేదీ వరకు తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

Akvan Cyclone Telangana | వాతావరణ మార్పులు..

నవంబర్ 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించనుందని, ఆకాశం మేఘావృతమై పలు చోట్ల మోస్తరు వర్షాలు పడొచ్చని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో, తుపాను రాకతో ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. మరోవైపు వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ ఈ వర్ష సూచన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని, వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలను గమనిస్తూ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad bus fire | పెట్రోల్ బంక్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. ఆహుతైన ఐదు ట్రావెల్స్ బస్సులు!

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *