తెలంగాణDSP Promotions | 35 మందికి ఇన్​స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి

DSP Promotions | 35 మందికి ఇన్​స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 35 మంది ఇన్​స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: DSP Promotions | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పలువురు డీఎస్పీలుగా పదోన్నతి పొందారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 35 మంది సీనియర్​ ఇన్​స్పెక్టర్లకు డిప్యూటీ సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​ (డీఎస్పీ)గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా.. వీరికి త్వరలోనే పోస్టింగ్​ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మరో మారు రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు జరుగనున్నట్లు తెలుస్తోంది.

DSP Promotions | పదోన్నతి పొందింది వీరే..

ఎస్​.వెంకటేశ్​ (సీఐడీ), కె.రవీందర్​ (ఈసీఆర్​, మంచిర్యాల), సి.విజయరాజు (సీఐడీ), జె.వెంకటేశ్వర్లు (సీఐ చందుర్తి), బి.ప్రవీణ్​ (మెయిన్​ ఇంటెలిజెన్స్​), బి.శ్రీనివాస్​ (డీసీఆర్​బీ, జగిత్యాల), ఎం.వెంకట నర్సయ్య(సీఐడీ), జి.మహేందర్​ రెడ్డి (సీఐ, మహబూబాద్​ టౌన్​), జి.సీతారెడ్డి (ట్రాఫిక్​ సీఐ, హన్మకొండ), బి.బాలాజీ (ఏసీబీ), నర్సింహారావు (సీఐ తుంగతుర్తి), ఎం.వెంకటరామయ్య (సీసీఎస్​, హైదరాబాద్​), బి.వెంకటేశ్వర్లు (సీఐడీ), కె.రామకృష్ణ (ఎస్​హెచ్​వో, ట్రాఫిక్​ పీఎస్​, మలక్​పేట్​), ఏ.భాస్కర్​ (ఈవోడబ్లూ పీఎస్​, మల్కాజ్​గిరి), కరుణాకర్​ (ఎస్​బీ హైదరాబాద్​), వెంకట్​రెడ్డి (మెయిన్​ ఇంటలిజెన్స్​), పి.రాజు (ఈగల్​ ఫోర్స్​), ఎన్​.వెంకటేశ్వర్లు (సీసీఎస్​, ఎల్​బీనగర్​), గోవర్ధనగిరి (ఏసీబీ), ఎస్​.వెంకటేశ్​ (ట్రాన్స్​కో), గురునాయుడు (మహేశ్వరం ఎస్​వోటీ), భూపతి గట్టుమల్లు (సీఐ, వనస్థలిపురం), హరినాథ్​బాబు (సీసీఎస్​, ఆసిఫాబాద్​), సీహెచ్​.రాజిరెడ్డి (ఎస్​బీ సీఐ, ఖమ్మం), ఆర్​.నరేందర్​ (వెయింటింగ్​ మల్టీజోన్​–1), ఏ.రాజయ్య (ఎస్​ఐబీ), బి.శ్రీనివాస్​ రావు (వీఆర్​, వరంగల్​), పెద్దన్న కుమార్​ (డీసీఆర్​, భూపాలపల్లి), టి.స్వామి (సీసీఆర్​బీ, ఖమ్మం), ప్రవీణ్​కుమార్​ (సీఐ, రామగుండం), కె.పురషోత్తం (ఎస్​బీ, రామగుండం), సరల రాజు (టాస్క్​ఫోర్స్​, వరంగల్​), గడ్డం యాదయ్య (సీఐ, తిమ్మాపూర్​), ఎం.రాజేశ్​ (ఏసీబీ) డీఎస్పీలుగా పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Govt arrears release | ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...

Exit Polls | ఎగ్జిట్ పోల్స్.. వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ, తమిళనాడులో డీఎంకే హవా!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exit Polls | ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై...

Shivdhar Reddy | శివధర్​ రెడ్డికి కీలక పదవి.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Shivdhar Reddy | మరికొద్ది గంటల్లో పదవీ విరమణ...