తెలంగాణShivdhar Reddy | శివధర్​ రెడ్డికి కీలక పదవి.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు..

Shivdhar Reddy | శివధర్​ రెడ్డికి కీలక పదవి.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొద్ది గంటల్లో పదవీ విరమణ పొందనున్న తెలంగాణ డీజీపీ శివధర్​ రెడ్డికి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Shivdhar Reddy | మరికొద్ది గంటల్లో పదవీ విరమణ పొందనున్న తెలంగాణ డీజీపీ శివధర్​ రెడ్డికి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ స్టేట్​ సెక్యూరిటీ అడ్వయిజర్​ (ఎస్​ఎస్​ఏ) ఛీఫ్​ సెక్రెటరీ హోదాలో నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్న శివధర్​ రెడ్డి రేపు (ఏప్రిల్​ 30న) రిటైర్​ కానున్నారు. ఆయన స్థానంలో ప్రభుత్వం సీవీ ఆనంద్​ను నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీగా కీలకంగా వ్యవహరించిన శివధర్​ రెడ్డికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కాగా.. 2025 అక్టోబర్​ 1న డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల అమలులో పక్కాగా వ్యవహరిస్తున్నారు.

Shivdhar Reddy | నక్సల్స్​ లొంగుబాటులో కీలకం

డీజీపీ శివధర్​ రెడ్డి నక్సల్స్​ లొంగుబాటులోనూ కీలకంగా వ్యవహరించారు. నక్సల్స్​ జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రోత్సహించారు. మావోయిస్టులు ఉద్యమ పంథాను వీడి జనంలోకి వచ్చేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఆయన హయాంలో పెద్ద ఎత్తున నక్సల్స్​ లొంగిపోయారు. ఇలా శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత కీలకంగా పనిచేయడంతో ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్​ సెక్యూరిటీ అడ్వయిజర్ (ఎస్​ఎస్​ఏ) పోస్టును ఏర్పాటు చేసి ఆయనను నియమించింది. ఎస్​ఎస్​ఏకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే వెల్లడించనుంది.

ఇది కూడా చదవండి..: DSP Promotions | 35 మందికి ఇన్​స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...

Exit Polls | ఎగ్జిట్ పోల్స్.. వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ, తమిళనాడులో డీఎంకే హవా!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exit Polls | ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై...

DSP Promotions | 35 మందికి ఇన్​స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి

అక్షరటుడే, వెబ్​డెస్క్​: DSP Promotions | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పలువురు...