అక్షరటుడే, వెబ్డెస్క్: IPO Listing Gains | ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, వైరింగ్ హార్నెస్ల డిజైన్, తయారీ, పంపిణీలో అనుభవమున్న ధూత్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ నుంచి రూ. 3,066.89 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. నూతన షేర్ల జారీ ద్వారా రూ. 1400 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 1,667 కోట్లు సమీకరించింది.
IPO Listing Gains | ఐపీవోకు భారీ స్పందన
ధూత్ ట్రాన్స్మిషన్ ఐపీవో (IPO)కు భారీ స్పందన లభించింది. మొత్తం 75 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. క్యూఐబీలు 209 రెట్లు, ఎన్ ఐఐలు 50 రెట్లు సబ్స్క్రైబ్ చేసుకోగా.. రిటైల్ కోటా 8.32 అధికంగా సబ్స్క్రైబ్ అయ్యింది.
IPO Listing Gains | 37.7 శాతం ప్రీమియంతో..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 871 కి విక్రయించగా.. రూ. 1,200 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 37.7 శాతం లాభాలు వచ్చాయన్న మాట.
IPO Listing Gains | మోల్బియో డయాగ్నోస్టిక్స్..
మోల్బియో డయాగ్నోస్టిక్స్ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 939.70 కోట్లు సమీకరించింది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 200 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 740 కోట్లు సమకూరాయి. ఐపీవో మొత్తం 70 రెట్లు సబ్స్క్రైబ్ కాగా.. క్యూఐబీ కోటా 186.39 రెట్లు, ఎన్ ఐఐ కోటా 49, రిటైల్ కోటా 12.97 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది.
21.44 శాతం లాభాలు..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 807కి వియ్రించగా.. రూ. 980 వద్ద లిస్టయ్యాయి. ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో 21.44 శాతం లాభం వచ్చింది.
ఇది కూడా చదవండి..: Stock Market Losses | నష్టాల్లోనే సూచీలు