Bullet 650 | బుల్లెట్ 650.. ధర రూ. 3.65 లక్షలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bullet 650 | రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) సంస్థ తన ఐకానిక్ మోటార్‌సైకిల్ ‘బుల్లెట’ను క్లాసిక్ లుక్‌తో పాటు శక్తిమంతమైన పనితీరును మేళవించి బుల్లెట్ 650 పేరుతో భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.3.65 లక్షలు. ఈ కొత్త మోడల్ బైక్ రైడింగ్ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా బుకింగ్స్, విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ బైక్ గురించి తెలుసుకుందామా..

Bullet 650 | కలర్ ఆప్షన్స్..

‘కానన్ బ్లాక’, ‘బ్యాటిల్‌షిప్ బ్లూ’ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

Bullet 650 | ఇంజిన్ సామర్థ్యం..

ఇందులో 650 సీసీ ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఎస్ వో హెచ్ సీ మోటార్. 46.4 బీహెచ్‌పీ, 52.3 ఎనఎం టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్‌ను జతచేశారు. దీంతో గేర్ మార్పులు స్మూత్‌గా ఉండడంతో పాటు రైడింగ్ అనుభవం మెరుగుపడుతుంది. ఈ బైక్ ను రిలాక్స్‌డ్ రైడింగ్ కోసం రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. అలాగే హైవే క్రూజింగ్, లాంగ్ డిస్టెన్స్ టూరింగ్‌కి కూడా ఇది అనువుగా ఉంటుందని పేర్కొంటోంది.

డిజైన్ : పాత తరహా లుక్, సిగ్నేచర్ స్టాన్స్ ను కొనసాగించారు. హ్యాండ్ పెయింటెడ్ గోల్డ్ పిన్‌స్ట్రైప్స్, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, నిటారుగా ఉన్న రైడింగ్ పొజిషన్ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు. ముందు భాగంలో 43 మి.మీ. టెలిస్కోపిక్ ఫోర్క్ ఉంది. ఇది 120 మి.మీ. వీల్ ట్రావెల్ ఇస్తుంది. వెనక భాగంలో ట్విన్ షాక్ అబ్సార్బర్లున్నాయి. ఇది 90 మి.మీ. ట్రావెల్ ఇస్తుంది.

1954 నాటి క్లాసిక్ బుల్లెట్ మోడల్‌ను గుర్తుచేసేలా క్యాస్కెట్ స్టైల్ హెడ్‌ల్యాంప్‌తో పాటు ఐకానిక్ ‘టైగర్-ఐ’ పైలట్ ల్యాంప్స్‌ను అమర్చారు. వెనక భాగంలో ఎల్ ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఫ్యుయల్ లెవల్, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్, సర్వీస్ రిమైండర్స్ లాంటి సమాచారం కనిపిస్తుంది.

బ్రేకింగ్ వ్యవస్థ : బ్రేకింగ్ వ్యవస్థలో ముందు 320 మి.మీ. డిస్క్, వెనక 300 మి.మీ. డిస్క్ ఉన్నాయి. ట్విన్ పిస్టన్ కాలిపర్లు, డ్యుయల్ చానల్ ఏబీఎస్ సిస్టమ్ కూడా అమర్చారు. క్లాసిక్ స్టైల్‌ను ఇష్టపడే వారికే కాకుండా శక్తిమంతమైన టూరింగ్ బైక్ కోరుకునే వారికి కూడా ఇది ఒక మంచి ఎంపికగా నిలుస్తుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: May 29 Market Analysis | పాజిటివ్​గా గ్లోబల్ క్యూస్.. ఫ్లాట్​గా ప్రారంభం కానున్న సెన్సెక్స్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *