అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rally Break | అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీనిని మార్కెట్ జీర్ణించుకున్నా.. ఆర్బీఐ గవర్నర్ చేసిన కామెంట్లతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు.
కేంద్ర బ్యాంక్ తన వైఖరిని ‘న్యూట్రల్’ నుంచి ‘క్యాలిబ్రేటెడ్ టైటనింగ్’కు మార్చడం ద్వారా భవిష్యత్‌లో మళ్లీ రెపో రేట్‌ను పెంచడానికి అవకాశం ఉందన్న సంకేతాన్ని ఇచ్చారు. ‘క్రమబద్ధమైన కఠినతరం వైపు మళ్లడం’ ఆర్బీఐ కఠిన వైఖరిని స్పష్టం చేసింది. దీనికి తోడు ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయిపై ఒత్తిడి, మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరుకుంటుందని అంచనా వేయడంతో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
Stock Market Rally Break | గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..
దేశీయ మార్కెట్లు (Domestic markets) బుధవారం గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 102 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 504 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుని 452 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 164 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాలనుంచి కోలుకుని 132 పాయింట్లు పెరిగినా సూచీలు నిలదొక్కుకోలేకపోయాయి. చివరికి సెన్సెక్స్ 129 పాయింట్ల నష్టంతో 72,638 వద్ద, నిఫ్టీ 173 పాయింట్ల నష్టంతో 22,603 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Rally Break | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,013 కంపెనీలు లాభపడగా 2,360 స్టాక్స్ నష్టపోయాయి. 241 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 160 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 157 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 4 కంపెనీలు లాభాలతో, 26 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. కోటక్ బ్యాంక్ 2.21 శాతం, ఎయిర్‌టెల్ 1.33 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.15 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.24 శాతం లాభపడ్డాయి.
Top Losers : టైటాన్ 3.52 శాతం, బీఈఎల్ 2.21 శాతం, ఆసియన్ పెయింట్ 2.07 శాతం, ఇన్ఫోసిస్ 2.06 శాతం, ఎల్టీ 1.96 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Vivo V80 5G | సరికొత్త ప్రీమియం ఫోన్ లాంచ్ చేసిన వీవో.. అక్టోబర్ 13 నుంచి అందుబాటులోకి..