అక్షరటుడే, కామారెడ్డి: AEO Death Kamareddy | వ్యవసాయ శాఖలో ఏఈవోగా పనిచేస్తున్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో విషాదం నింపింది. ఈ ఘటన రాజంపేట మండలం (Rajampet Mandal) తలమడ్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
AEO Death Kamareddy | తలమడ్ల గ్రామానికి చెందిన..
తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్యామ్ సుందర్ రెడ్డి(47) రాజంపేట ఏఈవోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూలాగే ఉదయం ఫార్మ్ హౌస్ వద్దకు వెళ్లిన ఆయన, విధులకు వెళ్లే సమయం దాటినా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఫార్మ్ హౌస్ వద్దకు వెళ్లి చూశారు. అక్కడ ఓ గదిలో శ్యామ్ సుందర్ రెడ్డి ఉరేసుకుని ఉన్నట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రెగ్యులర్‌గా విధులకు వెళ్లే శ్యాంసుందర్ రెడ్డి అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడటం ఇటు వ్యవసాయ శాఖలో, అటు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జీజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉద్యోగపరమైన ఒత్తిడి ఉందా.. కుటుంబ సమస్యలా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Auto Car Accident | ఆటో,కారు ఢీ.. ఇద్దరికి గాయాలు