అక్షరటుడే, వెబ్‌డెస్క్: Train Fire Accident | రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)లోని బీబీనగర్ సమీపంలో సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో బుధవారం ఈ ప్రమాదం జరిగింది.
బ్రేక్ లైనర్ చక్రానికి తగలడంతో మంటలు, పొగ వ్యాపించాయి. కో-పైలట్ ఈ సమస్యను గమనించి లోకో పైలట్‌కు తెలియజేయగా, ఆయన రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు ఆగగానే వెంటనే కిందకు దిగిపోయారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Bandi Sanjay Comments | ఓట్, సీట్ చోరీకి పాల్పడిన ఏకైక పార్టీ కాంగ్రెసే : బండి సంజయ్